: నాలుగు రోజుల ఏసీబీ కస్టడీకి రేవంత్ రెడ్డి... థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని కోర్టు ఆదేశం
టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిని నాలుగు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నెల 6వ తేదీ నుంచి 9 వరకు కస్టడీలో ఉంచుకునేందుకు సమ్మతించింది. ఈ నాలుగు రోజులూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏసీబీ రేవంత్ ను విచారిస్తుంది. లాయర్ సమక్షంలోనే రేవంత్ ను విచారించాలని కోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది. అంతేకాదు, రేవంత్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని కూడా ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ రెడ్డితో పాటు ఏ2 సెబాస్టియన్, ఏ3 ఉదయసింహలను కూడా కస్టడీకీ అనుమతించింది.