: కేసీఆర్ కు సినీ పరిశ్రమపై ప్రత్యేక అభిమానం ఉంది: మంత్రి తలసాని
టీఎస్ ముఖ్యమంత్రికి చిత్ర పరిశ్రమపై ప్రత్యేక అభిమానం ఉందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సినీ పరిశ్రమ చాలా సున్నితమైనదని చెప్పారు. త్వరలోనే ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎఫ్ డీసీ) ను విభజిస్తామని తెలిపారు. ఈ రోజు రవీంద్రభారతిలో 'తెలంగాణ సినిమా నిన్న, నేడు, రేపు' అనే సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ కవి నందిని సిద్ధారెడ్డి, అల్లం నారాయణ, ఎన్.శంకర్, విద్యాసాగర్ రావు, అల్లాణి శ్రీధర్ తదితరులు హాజరయ్యారు.