: ఇండియాలో ప్రారంభమై విదేశాలకూ పాకుతున్న మ్యాగీ పతనం


భారత్ లో ప్రారంభమైన మ్యాగీ పతనం విదేశాలకూ పాకుతోంది. ఇప్పటికే మ్యాగీపై మన దేశంలోని పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి. ఏపీ, తెలంగాణల్లో కూడా నిషేధం ఉంది. ఈ కలకలం భారత్ నుంచి క్రమంగా విదేశాలకూ పాకుతోంది. మ్యాగీనీ నిషేధిస్తూ నిన్న నేపాల్ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఇదే బాటలో పయనిస్తూ సింగపూర్ కూడా మ్యాగీని నిషేధించింది. అయితే, ఈ రోజు స్పందించిన మ్యాగీ యాజమాన్యం... పరిమితికి లోబడే లెడ్ ను వినియోగించామని, ఒకటి రెండు బ్యాచ్ లలో మాత్రమే ఓవర్ డోస్ అయిందని చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News