: ఏపీలో చనిపోయిన రైతు కుటుంబాలకూ రుణమాఫీ
రాష్ట్రంలో చనిపోయిన రైతు కుటుంబాలకు కూడా రుణమాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైతు సాధికార సంస్ధ విధివిధానాలు ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు 15వేల మంది చనిపోయిన రైతు కుటుంబాలకు రుణమాఫీ లబ్ధి కలుగుతుంది. ఇందుకోసం ఈ నెల 21లోగా స్థానిక బ్యాంకులు, రైతు సాధికార సంస్థకు దరఖాస్తు చేసుకోవాలని బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తెలిపింది. 30లోగా రుణమాఫీ సొమ్మును బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని వెల్లడించింది.