: మ్యాగీకి మమతా బెనర్జీ మద్దతు!


నెస్లే అందిస్తున్న 'మ్యాగీ' బ్రాండుకు ఊరట కలిగించేలా మమతా బెనర్జీ సర్కారు మద్దతు తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాగీలో ఎటువంటి హానికారక రసాయనాలు లేవని మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ సర్కారు స్పష్టం చేసింది. తమ పరిశోధనా కేంద్రాల్లో పలు రకాల మ్యాగీ ఉత్పత్తులను క్షుణ్ణంగా పరీక్షించామని ఆమె ఈ మధ్యాహ్నం వెల్లడించారు. ఏ విధమైన విషపూరితాలు లేవని పశ్చిమ బెంగాల్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం జరిపిన పరీక్షల అనంతరం వెల్లడైనట్టు ఆమె తెలిపారు. తమ రాష్ట్రంలో మ్యాగీ ఉత్పత్తులపై ఎటువంటి నిషేధమూ లేదని మమత వివరించారు.

  • Loading...

More Telugu News