: ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది: కేసీఆర్


జీవితంలో మంచి పనులు చేసే అవకాశం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే వస్తుందని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాదు మల్కాజిగిరిలో పేదలకు భూమి పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పేదల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయడానికైనా సిద్ధమని అన్నారు. జీవో నెంబర్ 58 కింద రెగ్యులైజేషన్ ప్రకారం లక్షా25వేల మందికి ఈ రోజు రాష్ట్రంలో భూమి పట్టాలు ఇస్తున్నామని తెలిపారు. వీటి విలువ రూ. 10 వేల కోట్లు ఉంటుందని చెప్పారు. ఇది జీవితంలో తనకు ఒక గొప్ప అనుభూతి అని పేర్కొన్నారు. కోర్టు కేసుల నేపథ్యంలో, ఇంకా 2 లక్షల మంది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని... కేసులు క్లియర్ కాగానే, వారికి కూడా పట్టాలు ఇస్తామని తెలిపారు. హైదరాబాద్ ను గుడిసెలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

  • Loading...

More Telugu News