: తప్పుకున్న కామత్, ఇన్ఫోసిస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆర్.శేషసాయి
ఇన్ఫోసిస్ చైర్మన్ బాధ్యతల నుంచి కేవీ కామత్ పదవీ విరమణ చేశారు. ఆ వెంటనే ప్రస్తుతం బోర్డు సభ్యుడిగా ఉన్న ఆర్.శేషసాయి తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. కాగా, బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) బ్యాంకు తొలి చైర్మన్ గా కామత్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఆయన బ్రిక్స్ కు వెళ్లడానికి ముందే శేషసాయి ఎంపిక పూర్తవుతుందని ముందుగానే వార్తలు వచ్చాయి. శేషసాయి ఇన్ఫోసిస్ కు రాక పూర్వం అశోక్ లేలాండ్ ఎగ్జక్యూటివ్ వైస్ చైర్మన్ గా విధులు నిర్వహించారు. గడచిన నాలుగేళ్లుగా ఆయన ఇన్ఫీ బోర్డులో ఉన్నారు.