: ఇక విజయవాడ నుంచి ఏపీ ఎక్స్ ప్రెస్... వారం రోజుల్లో ప్రారంభం


దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ గుంటూరు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు పలు విషయాలు తెలిపారు. వారం రోజుల్లో విజయవాడ-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభిస్తామని తెలిపారు. గత రైల్వే బడ్జెట్ లో ప్రకటించిన విధంగా ఏపీ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ ఎక్స్ ప్రెస్ కు తగిన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఇక, గుంటూరు, మంగళగిరి స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అంతేగాకుండా, గుంటూరు-గుంతకల్ మార్గాన్ని డబ్లింగ్ చేసేందుకు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News