: గవర్నర్ ను కలసిన సీఎం కేసీఆర్... రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చ!
గవర్నర్ నరసింహన్ తో రాజ్ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి కిందట భేటీ అయ్యారు. సీఎంతో పాటు ఏసీబీ డీజీ ఏకే ఖాన్, నిఘా విభాగాధిపతి శివధర్ రెడ్డి కూడా కలిశారు. రాష్ట్రంలో తాజా పరిణామాలైన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసు, పాలనాపరమైన అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్ ను అరెస్టు చేసిన తరువాత ఈ వారంలో గవర్నర్ ను కేసీఆర్ కలవడం ఇది రెండోసారి. అంటే రేవంత్ కేసుపైనే ప్రధానంగా నరసింహన్ తో మాట్లాడుతున్నట్టు సమాచారం.