: రేవంత్ వ్యవహారంపై కేంద్రానికి లేఖ రాస్తున్నా: వీహెచ్


టీ.టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి 'నోటుకు ఓటు' ఎపిసోడ్ పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు లేఖ రాయనున్నట్టు రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తెలిపారు. ఈ కేసులో సీబీఐ చేత విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నట్టు చెప్పారు. కాగా రేవంత్ రెడ్డి 'దొరికిన దొంగ' అని వీహెచ్ పేర్కొన్నారు. అవినీతి లేని సమాజాన్ని నిర్మిస్తానంటూ నవనిర్మాణ దీక్షలో సీఎం చంద్రబాబు ప్రకటన చేశారని, అవినీతిని ఎలా నిర్మూలిస్తారో చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News