: 'డీ లింక్ ఇండియా'తో ఎంఓయూ చేసుకున్న టీఎస్ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటూ బిజీగా ఉంది. తాజాగా ఈ రోజు 'డీ లింక్ ఇండియా' అనే సంస్థతో టీఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఎంఓయూ ప్రకారం తెలంగాణలో రూ. 350 కోట్ల పెట్టుబడులను డీ లింక్ పెడుతుంది. ఈ సంస్థ వల్ల వెయ్యి మందికి ఉద్యోగాలు దొరకనున్నాయి. నెట్ వర్క్ ట్రైనింగ్ సెంటర్, గ్లోబల్ రీసర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ ను డీ లింక్ ఇండియా ప్రారంభించనుంది.