: ఆర్కే నగర్ నియోజకవర్గానికి జయలలిత నామినేషన్
అన్నా డీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని రాధాకృష్ణన్ (ఆర్కే) నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 27న ఈ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. 30న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అక్రమాస్తుల కేసులో నిర్దోషిగా బయటపడిన జయలలిత ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దాంతో మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు ఉపఎన్నికకు పోటీ చేస్తున్నారు. అంతకుముందు కేసులో నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధించడంతో జయ ఎమ్మెల్యేగా అర్హత కోల్పోయారు.