: ఏసీబీ కస్టడీలో రేవంత్ ప్రాణానికి ముప్పు ఉంది: రేవంత్ తరపు న్యాయవాది


టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్, ఏసీబీ కస్టడీ పిటిషన్లను హైదరాబాదులోని ఏసీబీ కోర్టు విచారించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది నాగేశ్వర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ క్రమంలో నాగేశ్వర్ రెడ్డి వాదిస్తూ, ఏసీబీ కస్టడీకి రేవంత్ రెడ్డిని ఇస్తే, ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కోర్టుకు విన్నవించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఇంట్లో ఆరోజు ఉదయం నుంచే డబ్బు ఉందని తెలిపారు. వీడియో రికార్డింగ్ కోసం టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించారు. రేవంత్ వ్యవహారానికి సంబంధించి, మే 28నే సమాచారం ఉన్నప్పుడు, మే 31వ తేదీ వరకు ఎందుకు ఆగాల్సి వచ్చిందని అడిగారు. రేవంత్ ను అరెస్ట్ చేసిన రోజే కస్టడీకి ఎందుకు కోరలేదని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News