: రుతుపవనాలు వచ్చేశాయ్
నైరుతి రుతుపవనాలు ఈ మధ్యాహ్నం కేరళ తీరాన్ని తాకాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గడచిన 48 గంటలుగా అరేబియా సముద్ర కేంద్రంగా విస్తరించిన పవనాలు తీరం వైపు వచ్చేశాయని వివరించారు. కాగా, కేరళను తాకిన రుతుపవనాలు విస్తరించి తమిళనాడు, కర్ణాటకను దాటి తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేందుకు మరో వారం రోజుల సమయం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల రెండో వారంలో నైరుతి రుతుపవనాల ప్రభావం తెలంగాణ, ఏపీల్లో స్పష్టంగా కనిపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.