: 'రామ మందిరం'పై స్పందించరేం?: మోదీపై శివసేన విసుర్లు
అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా అత్యంత కీలకమైన అయోధ్య రామమందిర నిర్మాణంపై ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' (మనసులోని మాట) ఏంటో ఇప్పటికీ వెల్లడించలేదని శివసేన విమర్శించింది. దేశంలోని సమస్యలపై మాట్లాడుతున్న మోదీ, రామమందిరంపైనా మాట్లాడాలని 'సామ్నా' పత్రిక సంపాదకీయంలో శివసేన పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా, మందిర నిర్మాణాన్ని చేపట్టాలని సూచించింది. మందిర నిర్మాణ విషయమై బీజేపీ అనవసర భయాందోళనలకు గురవుతోందని వినయ్ కతియార్ వ్యాఖ్యలను ప్రస్తావించిన 'సామ్నా', మోదీ తన మనసులో ఏముందో ఇప్పటికైనా వెల్లడించాలని డిమాండ్ చేసింది.