: షర్మిళ యాత్రకు ఈ సారి కాంగ్రెస్ బ్రేకులు... అడ్డుకుని తీరతామంటున్న వీహెచ్


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిళ తెలంగాణలో చేపడుతున్న పరామర్శ యాత్రను ఈ సారి కాంగ్రెస్ అడ్డుకుంటుందట. ఈ మేరకు యాత్రను అడ్డుకుని తీరతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు చెప్పారు. వైసీపీని టీఆర్ఎస్ తెలంగాణ శత్రువుగా పేర్కొందని, మరి షర్మిళ యాత్రను టీఆర్ఎస్ ఎందుకు అడ్డుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. షర్మిళ యాత్రను టీఆర్ఎస్ అడ్డుకోకున్నా, తాము మాత్రం అడ్డుకుని తీరతామని వీహెచ్ చెప్పారు. తెలంగాణలో చేపట్టనున్న మలిదశ పరామర్శ యాత్రలో భాగంగా ఈ నెల 9 నుంచి షర్మిళ నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు.

  • Loading...

More Telugu News