: అమరావతిలో భూమిపూజ జరుగుతుందిలా!


రేపు ఉదయం నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణానికి భూమిపూజను శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. తెల్లవారుఝామున 3 గంటల నుంచి భూమిపూజ ప్రక్రియ మొదలుకానుంది. 19 మంది వేదపండితుల ఆధ్వర్యంలో హోమం జరగనుంది. ఉదయం 8 గంటలకు భూమిపూజ వేదిక వద్దకు సతీసమేతంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రానున్నారు. ముహూర్త సమయం ఉదయం 8:49కి చంద్రబాబు దంపతులు భూమిపూజ చేయనున్నారు. ఇందుకోసం తుళ్లూరు మండలం మందడం గ్రామం సర్వే నెంబరు 135, 136లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండనున్నారు.

  • Loading...

More Telugu News