: ‘ఖల్ నాయక్’ జీవితాన్ని తెరకెక్కిస్తానంటున్న బాలీవుడ్ అగ్ర దర్శకుడు


బాలీవుడ్ అగ్ర నటుడు, అక్రమ ఆయుధాల కేసులో ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న సంజయ్ దత్ జీవిత గాథను ఇకపై తెరపై చూడొచ్చు. బాలీవుడ్ సంచలన దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తన తదుపరి చిత్రానికి సంజయ్ దత్ జీవిత గాథను ఎంపిక చేసుకున్నారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం హిరానీనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ధనిక కుటుంబంలో జన్మించిన సంజయ్ దత్ చిన్నతనంలోనే చెడు సావాసాలకు అలవాటు పడ్డాడు. వాటి నుంచి దూరమయ్యేలోగానే తల్లి మరణం అతడిని మరింత కుంగదీసింది. ఆ తర్వాత తెరంగేట్రం చేసిన అతడు పలు హిట్ చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై జైలు జీవితాన్ని గడిపాడు. తాజాగా అదే కేసులో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ వృత్తాంతాన్ని ఇతివృత్తంగా తీసుకుని రాజ్ కుమార్ హిరానీ కథ రాస్తున్నారట. చిత్రంలో నటీనటుల విషయంపై ప్రస్తావించగా, ప్రస్తుతానికి కథ మీదే దృష్టిపెట్టానని, నటీనటుల విషయాన్ని తర్వాత ఆలోచిస్తానని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News