: అన్నవరం దేవస్థానంలో భక్తులపై దాడి... 15 మందికి తీవ్ర గాయాలు
తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం దేవస్థానంలో భక్తులపై దాడి జరిగింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన పెళ్లి బృందంపై అక్కడి ప్రైవేటు క్యాంటీన్ నిర్వాహకులు దాడి చేశారు. క్యాంటీన్ లో భోజనాలకు వెళ్లిన సమయంలో భోజనం బాగోలేదని నిర్వాహకులను పెళ్లి బృందం ప్రశ్నించింది. దాంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో భక్తులపై నిర్వాహకులు ఒక్కసారిగా కర్రలతో దాడి దిగారు. ఈ క్రమంలో మహిళలపైన కూడా చేయి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు భక్తులు, చిన్నారులు సహా 15 మంది తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే దగ్గరలోని తుని ఆసుపత్రికి తరలించారు.