: బాబు ఆదేశిస్తే తక్షణం రాజీనామా చేస్తానంటున్న విజయవాడ మేయర్


విజయవాడ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీ నేతల్లో నెలకొన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సొంత పార్టీ కార్పొరేటర్లు వ్యవహరిస్తున్న తీరుపై విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశిస్తే తక్షణం తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన తెలిపారు. ఓ పథకం ప్రకారం తనపై కొందరు బురద చల్లుతూ పరువు తీస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా, ఆయన నగర మేయరుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కార్పొరేటర్లతో ఏదో ఒక తగాదాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే మేయరును మార్చాలని దేశం కార్పొరేటర్లతో పాటు కొందరు సీనియర్ నేతలు సైతం చంద్రబాబుకు ఫిర్యాదులు చేసి ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో కోనేరు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

  • Loading...

More Telugu News