: మోదీ లాంటి పీఎం, కేజ్రీ లాంటి సీఎం కావాలి: బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్


దేశానికి నరేంద్ర మోదీ లాంటి ప్రధాన మంత్రి, ప్రతి రాష్ట్రానికి అరవింద్ కేజ్రీవాల్ లాంటి ముఖ్యమంత్రి కావాలని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ అన్నారు. ప్రస్తుతం దేశంలో వాణిజ్య వాతావరణం బాగానే ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఎకనమిక్స్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ బజాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమోషనల్ గా ఉండే భారతీయుల్లో ఉద్వేగాలు వేగంగా పెరిగినట్లే తిరిగి అంతే వేగంగా తగ్గిపోతాయన్నారు. ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ మెరుగ్గా రాణిస్తున్నారని బజాజ్ అన్నారు. అంతమాత్రాన తాను మోదీకి వ్యతిరేకం కాదని కూడా వ్యాఖ్యానించారు. ఢిల్లీ సీఎంగా ఉన్న కేజ్రీవాల్ కు ఢిల్లీలోని ప్రతి గల్లీతో పాటు ప్రతి అధికారిపైనా పూర్తి అవగాహన ఉందని బజాజ్ కితాబిచ్చారు.

  • Loading...

More Telugu News