: మ్యాగీపై తొలిసారి నోరు విప్పిన నెస్లే చీఫ్ పాల్ బల్కే
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మ్యాగీ నూడుల్స్ విషయంలో నెస్లే సంస్థ తొలిసారిగా అధికారికంగా స్పందించింది. ఈ మధ్యాహ్నం సంస్థ గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాల్ బల్కే మీడియాతో మాట్లాడారు. మ్యాగీ నూడుల్స్ తినేందుకు అర్హమైనవేనని ఆయన అన్నారు. వివాదం చెలరేగుతోంది కాబట్టి మార్కెట్లోని సరుకును వెనక్కు తీసుకుంటున్నామని ఆయన వివరణ ఇచ్చారు. గడచిన 30 సంవత్సరాలుగా ఈ ప్రొడక్టు మార్కెట్లో అందుబాటులో ఉందని ఆయన గుర్తు చేశారు. మ్యాగీలో మోనో సోడియం గ్లుటమేట్ లేదని ఆయన తెలిపారు. నాణ్యతలో తామెప్పుడూ రాజీ పడలేదని, ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనైనా ఒకే విధమైన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నామని ఆయన వివరించారు. భారత ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో మ్యాగీ విషయమై చర్చిస్తున్నామని, త్వరలోనే తిరిగి మార్కెట్లోకి అడుగుపెడతామన్న నమ్మకముందని వివరించారు.