: వీసా కోసం దంపతుల అవతారమెత్తి అడ్డంగా దొరికిపోయారు!


ఎలాగైనా అమెరికా వీసాను పొందాలని భావించిన ఓ యువతి, మరో యువకుడు దంపతుల అవతారం ఎత్తారు. తాము వివాహితులమని చెన్నైలోని అమెరికన్ కాన్సులేట్ ను నమ్మించాలని ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే, గుజరాత్‌ కు చెందిన ఏంజలిన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శంకర్ లు వీసాకోసం దరఖాస్తు చేసుకుంటూ తప్పుడు ధృవపత్రాలు, నకిలీ దస్తావేజులు అందించారు. వీరు ఇచ్చిన పత్రాలను పరిశీలిస్తున్న సమయంలో అవి నకిలీవని తేలింది. భార్యాభర్తలుగా నటిస్తూ, వీరు వీసా పొందేందుకు యత్నిస్తున్నారని తెలుసుకున్న అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News