: గుజరాత్ కొత్త స్కీం... 'సులభ్'లో ఒకసారి మూత్రవిసర్జనకు ఒక రూపాయి ఇస్తారట!
బహిరంగ మూత్ర విసర్జనను అరికట్టే దిశగా గుజరాత్ సర్కారు కొత్త స్కీమును ప్రారంభించింది. 'రూపీ ఫర్ పీ' పేరిట సులభ్ కాంప్లెక్సుల్లో మూత్ర విసర్జన చేసే వారికి ఒక రూపాయిని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి ముఖ్య ప్రాంతాలు, కూడళ్లలో ఉన్న 67 కాంప్లెక్సుల వద్ద ఈ స్కీమ్ ను అమలు చేస్తున్నామని, త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని అధికారులు చెబుతున్నారు. పబ్లిక్ టాయిలెట్స్ వినియోగంపై ప్రజల్లో, ముఖ్యంగా మురికి వాడల్లో నివసిస్తున్న వారిలో అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించామని, చాలా వరకు స్లమ్ ఏరియాల్లో ఈ రూపాయి స్కీం మొదలైందని మునిసిపల్ అధికారి ఒకరు వివరించారు.