: 'జయ కేసు' విచారణ ఖర్చులు ఇవ్వాలని తమిళనాడును కోరతాం: కర్ణాటక


అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జయలలిత, మరో ముగ్గురి కేసు విచారణకు అయిన ఖర్చుల ఇవ్వాలని తమిళనాడు రాష్ట్రాన్ని కోరాలని కర్ణాటక నిర్ణయించింది. 12 ఏళ్ల పాటు కొనసాగిన ఈ కేసులో జయ, ఆమె సన్నిహితురాలు శశికళ, ఇళవరసన్, మరొకరు బెంగళూరు సెషన్స్ కోర్టుకు విచారణకు హాజరైనప్పుడల్లా భద్రతా ఏర్పాట్లు తదితరాలకు రూ.5.11 కోట్లు ఖర్చు అయిందని కర్ణాటక న్యాయశాఖ మంత్రి టీబీ.జయచంద్రన్ తెలిపారు. దానికి సంబంధించి హోంశాఖ నుంచి ఇంకా పూర్తి వివరాలు రావల్సి ఉందని, వచ్చాక ఖర్చులపై మరింత స్పష్టత వస్తుందని చెప్పారు. జయ కేసులో తమిళనాడు కోర్టులో విచారణ పారదర్శకంగా జరగడం లేదంటూ డీఎంకే కార్యదర్శి అన్బళగన్ 2003లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో అదే ఏడాది నవంబర్ 18న ఆ కేసును కర్ణాటక సెషన్స్ కోర్టుకు సుప్రీం బదలాయించింది. కాగా ఇటీవలే నిర్దోషిగా రుజువైన జయ మరోసారి తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News