: తెలంగాణ ‘త్యాగశీలి’ అడ్రెస్ ఎక్కడ?... మీడియాకు చిక్కని ఆచూకీ!


తాను కష్టపడి సంపాదించుకున్న పోలీసు ఆఫీసర్ ఉద్యోగాన్ని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తృణప్రాయంగా త్యజించింది ఆ ధీర వనిత. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామన్న యూపీఏ ప్రకటనతో ప్రాణంగా ప్రేమించే పోలీసు శాఖలో తిరిగి చేరిపోయింది. అయితే ప్రకటనైతే వచ్చింది కానీ, రాష్ట్ర ఏర్పాటు దిశగా అడుగులు పడకపోవడంతో తిరిగి ఉద్యోగానికి రాజీనామా చేసింది. తీరా ఏడాది క్రితం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది. ఆ ధీర వనిత కోరిక నెరవేరింది. అయితే తిరిగి ఆమె పోలీసు ఆఫీసర్ గా కనిపిస్తుందనుకున్న తెలంగాణ వాదుల ఆశలు నేటికీ నెరవేరకపోగా, అసలు ఆ ఉద్యమశీలి అడ్రెస్ కూడా లభించడం లేదు. నెలల తరబడి మీడియా వెతికినా ఆమె జాడ తెలియడం లేదు. ఇదీ మెదక్ డీఎస్పీగా ఉద్యోగంలో చేరిన ఐదు నెలలకే రాజీనామా చేసిన నళిని వాస్తవ గాథ. తెలంగాణ రాష్ట్రం కోసం రెండు సార్లు రాజీనామా చేసిన నళినికి తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత తిరిగి ఉద్యోగం దక్కలేదు. అంతేకాక ఆమె ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు.

  • Loading...

More Telugu News