: దమ్ముంటే చంద్రబాబు ఆడియో టేపులు బయట పెట్టండి... కేసీఆర్ కు ఏపీ హోం మంత్రి సవాల్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ హోం మంత్రి చినరాజప్ప ఫైర్ అయ్యారు. ఓటుకు నోటు విషయంలో చంద్రబాబు మాట్లాడిన టేపులు కూడా ఉన్నాయని చెబుతున్నారని... దమ్ముంటే తమ అధినేత చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులను బయట పెట్టాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగినంత బలం లేకపోయినా... టీఆర్ఎస్ పార్టీ ఐదు స్థానాలను ఎలా కైవసం చేసుకుందని ప్రశ్నించారు. అలాగే, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాదులోని ఏపీ మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని... ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News