: తండ్రిపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన నారా లోకేశ్!
టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ నిన్న ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సాధారణంగా ప్రైవేట్ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉండే లోకేశ్ నిన్న మాత్రం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహ్మాన్ ఆహ్వానాన్ని మన్నించారు. సదరు కార్యక్రమం కోసం బయటకు వెళ్లేందుకు ఇష్టపడని లోకేశ్, రెహ్మాన్ నే పార్టీ కార్యాలయానికి ఆహ్వానించారు. అసలు విషయానికొస్తే, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాజకీయ ప్రస్థానంలోని ప్రధాన ఘట్టాలను ప్రస్తావిస్తూ ‘చంద్రన్న అడుగుజాడల్లో..’ అనే పుస్తకాన్ని రెహ్మాన్ రాశారు. ఆ పుస్తకాన్ని లోకేశ్ నిన్న హైదరాబాదులోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆవిష్కరించారు.