: హైదరాబాదులో ఆర్టీసీ బస్సు బీభత్సం... ఒకరు మృతి, పలువురికి గాయాలు
హైదరాబాదులో నేటి ఉదయం ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. నగరంలోని వారాసిగూడలో స్పీడుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి వాహనదారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందగా, పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన మరుక్షణమే బస్సు దిగిన డ్రైవర్ అక్కడినుంచి పరారయ్యాడు. బస్సు అదుపు తప్పడానికి గల కారణాలు తెలియరాలేదు.