: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్ గఢ్ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. మావోయిస్టులను నియంత్రించే అంశంలో తెలంగాణ సహకరించడం లేదని ఫిర్యాదులో ఆరోపించింది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మావోలను పూర్తిగా అదుపు చేయగలిగామని... రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ పరిస్థితి లేదని ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆరోపించారు. తెలంగాణ ఏర్పడితే మావోయిస్టులు బలపడతారన్న వాదన గతంలో బలంగా ఉండేది... అయితే, తెలంగాణ వాదులు ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించేవారు.