: 'విల్ఫీ' ద్వారా మోదీకి శుభాకాంక్షలు చెప్పిన యువరాజ్ సింగ్
విజయవంతంగా ఒక సంవత్సరం పాలనను పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీకి, ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపాడు. విల్ఫీ (వీడియో సెల్ఫీలను 'విల్ఫీ' అంటున్నారు లెండి)తో తన వీడియోను తానే తీసుకుని, మోదీ గతంలో ఓ సభలో చెప్పిన వాక్యాలను చెబుతూ శుభాకాంక్షలు తెలిపాడు. దీన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. దీనిపై మోదీ కూడా స్పందించారు. కృతజ్ఞతలు చెబుతూ, "యూవీ, నువ్వు మైదానంలోనూ, బయటా ఒకే విధమైన టాలెంటును కలిగివున్నావు. నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను" అని సమాధానం ఇచ్చారు. ఈ విల్ఫీకి 900కు పైగా రీట్వీట్లు, 450కి పైగా షేర్లు, 27 వేలకు పైగా లైక్ లు వచ్చాయి.