: 'అనవసరంగా చక్కర్లు కొట్టొద్దు'... మహిళా ఉద్యోగినుల పట్ల కర్ణాటక సర్కారు వివక్ష


సుమారు 10 వేల మందికిపైగా ఉన్న విధాన సౌధ, వికాస సౌధ ఉద్యోగులకు కర్ణాటక సర్కారు ఒక సర్క్యులర్ ను జారీ చేసింది. గ్రూపులుగా చేరి కారిడార్లలో బాతాఖానీ కొడుతూ, పెద్దగా మాట్లాడుతూ ఉండవద్దు, మొబైల్ ఫోన్లు వాడవద్దన్నది దాని సారాంశం. అంతవరకూ బాగానే ఉంది. ఈ సర్క్యులర్ లో మరో వాక్యం ఉందే. అదే ఇప్పుడు సమస్యగా మారింది. మహిళా ఉద్యోగినులను లక్ష్యంగా చేసుకుని 'అనవసరంగా చక్కర్లు కొట్టొద్దు' అని కూడా దానిలో ఉండడం విమర్శలకు దారి తీసింది. సర్కారు తీరును పలువురు ఎండగట్టారు. లింగ వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. పలువురు మహిళా ఉద్యోగినులు ఈ విషయమై బహిరంగంగా మాట్లాడటానికి భయపడుతున్నారు. కాగా, దీనిపై కర్ణాటక న్యాయమంత్రి టీబీ జయచంద్ర వివరణ ఇస్తూ, "ఇది అందరు ఉద్యోగులకూ వర్తిస్తుంది. కేవలం మహిళలకు మాత్రమే కాదు. అయితే, ఆ వాక్యంలో మహిళలు అని ఉండకుండా ఉండాల్సింది. దీన్ని సరిచేసి మరో సర్క్యులర్ జారీ చేస్తాం" అన్నారు.

  • Loading...

More Telugu News