: రేవంత్ కేసును ఏసీబీ దర్యాప్తు చేస్తోందా? లేక టీఆర్ఎస్ మంత్రులా?: టీడీపీ నేత రావుల


రేవంత్ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న తీరుపై టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ మంత్రులే దర్యాప్తు చేస్తున్నట్టు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వైపు రేవంత్ కు సంబంధించిన టేపులు తాము ఎవరికీ ఇవ్వలేదని ఏసీబీ డీజీ ఏకే ఖాన్ చెబుతుంటే... మరోవైపు రేవంత్ కు సంబంధించిన ఫుటేజ్ మొత్తం తమ వద్ద ఉందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారని విమర్శించారు. రాజ్యాంగంతో సంబంధం లేని విధంగా మంత్రులు మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందని అన్నారు. దర్యాప్తు చేస్తున్నది ఏసీబీనా? లేక మంత్రులా? అన్న సందేహం వస్తోందని చెప్పారు. కుట్రలతో రేవంత్ ను ఇరికించారని... మరి, టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి ముద్దాయని, ఆయనపై ముందుగా కేసు పెట్టాలని రావుల డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News