: బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఎయిరిండియా ఉద్యోగి... జెడ్డాలో అరెస్ట్
ఎయిరిండియాలో 'క్యాబిన్ క్రూ'గా పనిచేస్తున్న ఓ వ్యక్తి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నాడన్న ఆరోపణలపై సౌదీ అరేబియాలోని జెడ్డా విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జెడ్డా నుంచి కొచ్చికి ఈ విమానం బయలుదేరాల్సి వుంది. దీంతో 11 మంది క్యాబిన్ క్రూతో బయలుదేరాల్సిన విమానం 10 మందితోనే వెనుదిరిగి వచ్చింది. అయితే, తమ సంస్థకు చెందిన ఓ ఉద్యోగిని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారని, కారణం మాత్రం ఇంకా తమకు తెలియదని ఏఐ అధికారి ఒకరు తెలిపారు. అతని అరెస్టుకు వెనుకగల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని, తప్పు చేశాడని తేలితే చర్యలు తీసుకుంటామని వివరించారు.