: రేవంత్ రెడ్డిపై కుట్రలో కేసీఆర్ పాత్ర ఉంది: ఏపీ హోం మంత్రి చినరాజప్ప


తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ఏపీ డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఫైరయ్యారు. కొద్దిసేపటి క్రితం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మాట్లాడిన ఆయన కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు కుమ్మక్కు రాజకీయాలకు తెరతీశారని ఆరోపించారు. టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డిపై జరిగిన కుట్రలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. రేవంత్ పై జరిగిన కుట్రలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖకు ఏమాత్రం ప్రమేయం లేదని కూడా ఆయన తేల్చిచెప్పారు. వైసీపీ అధినేత జగన్ తో కుమ్మక్కైన కేసీఆర్ అవినీతిని ప్రోత్సహిస్తున్నారని కూడా చినరాజప్ప ఆరోపించారు.

  • Loading...

More Telugu News