: 11న రేవంత్ కుమార్తె నిశ్చితార్థం, బెయిల్ దొరికేనా?


వారం రోజుల్లో కుమార్తె నిశ్చితార్థం, అప్పటికైనా బెయిల్ వస్తుందా? రాదా?... అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె నిశ్చితార్థం ఏ ఆటంకం లేకుండా సాగిపోతుందా?... ఇవీ జైల్లో ఉన్న తెదేపా అధినేత రేవంత్ రెడ్డి మనసును తొలిచేస్తున్న ఆలోచనలు. ఈ నెల 11న హైదరాబాదులో ఆయన కుమార్తె నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈలోగా 'ఓటుకు నోటు' ఘటనలో ఆయన్ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. ఏసీబీ కస్టడీ ముగిస్తే బెయిలు కాస్త సులభంగానే లభిస్తుంది. ఒకవేళ నిశ్చితార్థం సమయానికి బెయిలు లభించకుంటే, కోర్టును ప్రత్యేక పర్మిషన్ అడగాలన్నది ఆయన తరపు న్యాయవాదుల అభిప్రాయం. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం రేవంత్ శుభకార్యానికి హాజరయ్యే విషయంలో ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News