: సత్తిబాబు తప్పు చేశారు... అందుకే సస్పెండ్ చేశాం: ఏపీసీసీ చీఫ్ రఘువీరా


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తప్పు చేశారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి చెప్పారు. బొత్స సస్పెన్షన్ పై పార్టీ అధిష్ఠానం నుంచి సమాచారం అందుకున్న రఘువీరారెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను ఎంతమాత్రం సహించబోమన్న ఆయన, పార్టీలో ఉంటూనే పార్టీకి నష్టం కలిగించే రీతిలో వ్యవహరించిన సత్తిబాబుపై సస్పెన్షన్ వేటు వేయక తప్పలేదని ఆయన పేర్కొన్నారు. బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరుతున్నారన్న అంశంపై స్పందించిన రఘువీరా, కాంగ్రెస్ ను ఎవరు వీడినా పార్టీకి ఎలాంటి నష్టం లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News