: ఇది ఓ తండ్రి ఆవేదన!


ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన మహ్మద్ నజీర్ అనే వ్యక్తి ఓ చిరు వ్యాపారి. అతనికి ఎనిమిది మంది సంతానం. బాధాకరమైన విషయం ఏమిటంటే, వారిలో ఆరుగురు పిల్లలు నరాల వ్యాధి పీడితులు. వ్యాధి కారణంగా, మిగతా పిల్లల్లా వారు పనులు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఓ రకంగా జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్నారు. నజీర్ సంపాదనంతా వ్యాధిగ్రస్తులైన సంతానం కోసమే సరిపోయేది. ఈ నేపథ్యంలో, ఆ తండ్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన పిల్లల కారుణ్య మరణానికి అనుమతించాలని కోరారు. తన పిల్లలు పడుతున్న నరకయాతన చూడలేక, వైద్యం చేయించే శక్తి లేక ఈ నిర్ణయం తీసుకున్నానని లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News