: ఇది మన సినిమా... అందుకే యాంకరింగ్ చేస్తున్నా: చార్మి
సాధారణంగా ఆడియో ఫంక్షన్లంటే హీరోయిన్లు కాస్త లేటుగా వస్తుంటారు. కానీ, జ్యోతిలక్ష్మీ ఆడియో వేడుకలో డిఫరెంట్ సీన్ కనిపించింది. ఈ చిత్ర హీరోయిన్ చార్మి మాత్రం త్వరగానే వేదిక వద్దకు చేరుకుంది. అంతేగాదు, తనదైన తెలుగుతో యాంకరింగ్ చేస్తూ అభిమానులను ఉత్సాహపరిచింది. చార్మి జోరు చూసి రెగ్యులర్ యాంకర్ శ్యామల సెటైర్లు విసిరింది. గతంలో అనూరాధ, సిల్క్ స్మిత వంటి వ్యాంప్ నటీమణులుండేవారని, ఆ పాత్రలను హీరోయిన్లే పోషిస్తుండడంతో వారు తెరమరుగయ్యారని పేర్కొంది. ఇక, హీరోయిన్లే యాంకరింగ్ కూడా చేస్తే సుమ, ఝాన్సీ, తాను ఏమైపోవాలని చిరుకోపం ప్రదర్శించింది. దీనికి చార్మి బదులిస్తూ... 'ఇది మన సినిమా' అని అందుకే యాంకరింగ్ చేస్తున్నానని తెలిపింది.