: కేసీఆర్, చంద్రబాబులకు మధ్యవర్తిగా ఇక్కడకు రాలేదు: కేంద్ర మంత్రి గోయల్
కేంద్ర మంత్రి పియూష్ గోయల్ గురువారం హైదరాబాద్ విచ్చేశారు. విద్యుత్ సంబంధ సమస్యలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యానని తెలిపారు. అంతేతప్ప, రేవంత్ రెడ్డి వ్యవహారంలో కేసీఆర్, చంద్రబాబులకు మధ్యవర్తిగా తానిక్కడికి రాలేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారంలో తానేమీ మాట్లాడబోనని తెలిపారు. సాధారణ పర్యటనల్లో భాగంగానే హైదరాబాద్ వచ్చినట్టు గోయల్ చెప్పారు. ఆయన నేడు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా పేర్కొన్నారు.