: ఏపీ రాజధాని భూమిపూజకు ఓకే చెప్పిన సీఈసీ


ఏపీ రాజధాని భూమిపూజకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అనుమతి ఇచ్చింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కోడ్ అమలులో ఉన్నందున జూన్ 6న జరగాల్సిన భూమిపూజకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సర్కారు సీఈసీని కోరింది. ఏపీ ప్రభుత్వం వినతిని పరిశీలించిన సీఈసీ షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. కోడ్ అమలులో ఉన్నందున ఈ నెల 5,6,8 తేదీల్లోనే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని తెలిపింది. ఎలాంటి ప్రకటనలు చేయవద్దని స్పష్టం చేసింది. ఈ నెల 8న జరిగే సభకు కొన్ని షరతులు వర్తిస్తాయని పేర్కొంది. ఈ మేరకు సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుకు కేంద్రం ఎన్నికల సంఘం సమాచారం అందించింది.

  • Loading...

More Telugu News