: అసిస్టెంట్ డైరక్టర్ గా అవకాశమిస్తే దర్శకుడిని తుపాకీతో బెదిరించి దోపిడీ
తమిళ చిత్ర పరిశ్రమలో ఓ యువకుడికి అసిస్టెంట్ డైరక్టర్ గా అవకాశమిచ్చిన సినీ డైరక్టర్ ఒకరు ఇప్పుడు తీరిగ్గా వాపోతున్నారు. ఎందుకంటే, ఆ సహాయ దర్శకుడు అవకాశమిచ్చిన సదరు డైరక్టర్ కు షాకిచ్చాడు. తుపాకీతో బెదిరించి దర్శకుడిని దోచుకున్నాడు. వివరాల్లోకెళితే... తంగై కె శరవణన్ తమిళ చిత్రసీమలో దర్శకుడు. జమున ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకం పేరిట 'మిస్ పన్నాదీంగ అప్పరం వరుత్తపడువీంగ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం చెన్నైలోని వలసరవాక్కంలో ఆఫీసు తెరిచారు. దర్శకుడు శరవణన్ తన ఆఫీసులో ఉండగా, ప్రభాకర్ అనే అసిస్టెంట్ డైరక్టర్ తుపాకీతో లోపలికి ప్రవేశించాడు. అతని వెంట మరికొందరు వ్యక్తులున్నారు. ప్రభాకర్ తుపాకీని శరవణన్ కు గురిపెట్టి బెదిరించి, 40 సవర్ల బంగారం, రూ.2 లక్షల నగదు దోచుకున్నాడు. దీనిపై, శరవణన్ నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. సహాయ దర్శకులుగా కొత్తవారిని తీసుకునేటప్పుడు, వారి పూర్తి వివరాలు తెలుసుకోకపోతే ఎలా? అని చిత్ర సీమకు చెందిన వ్యక్తులు అంటున్నారు.