: సోనియా ఆదేశిస్తే వరంగల్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తా: సర్వే సత్యనారాయణ
మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ వరంగల్ ఎంపీ సీటుపై కన్నేశారు. తమ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. మొన్నటి వరకు వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరి తాజగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అటు ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఆయన కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేస్తున్నారు. దాంతో అక్కడ ఉపఎన్నిక అవసరమవుతుంది. ఈ క్రమంలోనే సర్వే వరంగల్ నుంచి లోక్ సభ సభ్యుడిగా పోటీ చేయాలని ఆరాటపడుతున్నారు.