: ఈ కేసులో రేవంత్ ను ఇరికించింది చంద్రబాబే: గట్టు


రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారంపై టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు నిప్పులు చెరిగారు. అసలు, ఈ కేసులో రేవంత్ రెడ్డిని ఇరికించింది చంద్రబాబేనని మండిపడ్డారు. తానేం తప్పు చేయలేదని చంద్రబాబు తప్పించుకోజూస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు ఓ దొంగల ముఠా నాయకుడని, వెన్నుపోట్లు ఆయన నైజమని దుయ్యబట్టారు. చంద్రబాబుకు మతి తప్పిందని, ఏపీ ప్రజలు తలదించుకునేలా ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఈ కేసులో వాస్తవాలు తెలిపితే మంచిదని గట్టు అన్నారు. స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన డబ్బు ఎవరు ఇవ్వమన్నారో చెప్పాలన్నారు.

  • Loading...

More Telugu News