: మీకు తెలుసా?... పన్ను చెల్లించనక్కర్లేని 9 రకాల ఆదాయాలు


సంపాదించే అన్ని రకాల ఆదాయాలపై పన్ను చెల్లించాల్సి వుంటుందన్నది పలువురి అభిప్రాయం. కానీ, ఇందులో పూర్తిగా నిజం లేదు. ఎన్నో రూపాల్లో వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 1961 నాటి భారత ఆదాయపు పన్ను చట్టం సెక్షన్-10 ప్రకారం వ్యక్తికి లభించే పలు రకాల ఆదాయాలపై పన్ను రాయితీలు అమలవుతున్నాయి. వాటిని గురించి తెలుసుకుందాం. వ్యవసాయ ఆదాయం: అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడ్డ దేశంగా గుర్తింపున్న ఇండియాలో అగ్రికల్చర్ ఇన్ కంపై పన్నులు ఉండవు. అయితే, ఇది వ్యక్తిగత పన్ను చెల్లింపు వ్యవధి (60 సంవత్సరాల లోపైతే రూ. 2.5 లక్షలు, ఆపై 80 సంవత్సరాల లోపు రూ. 3 లక్షలు, ఆపై రూ. 5 లక్షలు) దాటరాదు. ఒకవేళ ఈ పరిధి దాటితే మాత్రం, ఎంత అధిక మొత్తం ఆదాయం పొందితే దానికి పన్ను చెల్లింపులు జరపాలి. ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చే ఆస్తి: ఒకవేళ మీరు హిందూ ఉమ్మడి కుటుంబంలో ఉండి, మీకు ఏదైనా డబ్బు లభిస్తే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(2) ప్రకారం రాయితీలు లభిస్తాయి. సేవింగ్స్ ఖాతాలపై వచ్చే వడ్డీ: మీకో సేవింగ్స్ ఖాతా ఉండి దానిపై వడ్డీ వస్తున్న పక్షంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 వేల వరకూ పన్ను రాయితీలు ఉంటాయి. ఈ వడ్డీ రూ. 10 వేలు దాటితే, దాటిన మొత్తానికి పన్ను చెల్లించాలి. భాగస్వామ్య సంస్థ నుంచి వచ్చే వాటా: ఏదైనా ఒక సంస్థలో మీరు భాగస్వామిగా ఉండి ఉంటే, మీకు వచ్చే లాభాలపై పన్ను ఉండదు. అయితే, మూలధనం వడ్డీ, రెమ్యునరేషన్ పై మాత్రం రాయితీలు రావు దీర్ఘకాల మూలధన లాభాలు: ఇది ఈక్విటీ ఇన్వెస్టర్లకు శుభవార్తే. కంపెనీ వాటాలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పై లభించే దీర్ఘకాల మూలధన లాభాలు సెక్షన్ 10 (36) ప్రకారం పన్ను పరిధిలోకి రావు. అయితే, ఇది డెట్ ఫండ్స్ కు వర్తించదు. విదేశీ సేవలపై లభించే అలవెన్సులు: భారతీయులు దేశం బయటి కంపెనీలకు సేవలందిస్తున్న పక్షంలో సెక్షన్ 10 (7) ప్రకారం పన్ను రాయితీలు పొందవచ్చు. గ్రాచ్యూటీ ఆదాయం: ఒక సంస్థ నుంచి పదవీ విరమణ చేసిన తరువాత లభించే గ్రాచ్యూటీపై పూర్తి రాయితీలు వర్తిస్తాయి. చివరి సర్వీసు సంవత్సరంలో ఆఖరు నెల వేతనంగా అందుకున్న మొత్తంలో 15 రోజుల వేతనం లెక్కించి, ఎన్ని సంవత్సరాలు విధులు నిర్వహిస్తారో అన్ని 15 రోజుల మొత్తాన్ని గ్రాచ్యూటీ రూపంలో ఉద్యోగికి యాజమాన్యం అందిస్తుందన్న సంగతి తెలిసిందే. స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే వచ్చే ఆదాయం: ఓ సంస్థ నుంచి వాలంటరీ రిటైర్ మెంటు స్వీకరిస్తే వచ్చే మొత్తం ఆదాయంపై రూల్ 2బిఎ (ఐటీ చట్టం) ప్రకారం రాయితీలు వర్తిస్తాయి. మొత్తం రూ. 5 లక్షల వరకూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. స్కాలర్ షిప్పులు, అవార్డులు: ఏదైనా స్కాలర్ షిప్ లేదా అవార్డు అందుకున్న సమయంలో లభించే మొత్తానికి సెక్షన్ 10 (16) ప్రకారం పన్ను రాయితీ లభిస్తుంది. ఈ ఆదాయంపై గరిష్ఠ పరిమితులు కూడా లేకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News