: ద్రావిడ్ ఉంటే అద్భుతంగా ఉండేది: కోహ్లీ
టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ బీసీసీఐ సలహా సంఘం ఏర్పాటుపై స్పందించాడు. ఆ కమిటీలో బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ కు కూడా స్థానం కల్పించి ఉంటే అద్భుతంగా ఉండేదన్నాడు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్, ద్రావిడ్ లతో కూడిన సలహా సంఘం దివ్యంగా ఉండేదని అభిప్రాయడపడ్డాడు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... దిగ్గజాల ఆట చూస్తూ ఎదగడం అమోఘమైన విషయం అని తెలిపాడు. ఇక, రవిశాస్త్రిని కోచింగ్ డైరక్టర్ గా కొనసాగించాలన్న బీసీసీఐ నిర్ణయాన్ని స్వాగతించాడు. శాస్త్రి ఎంతకాలం కొనసాగినా, అది జట్టుకు లాభిస్తుందని పేర్కొన్నాడు. జట్టులో ఆత్మవిశ్వాసం నింపుతాడని చెప్పాడు.