: ఎవరికీ భయపడను... బుల్లెట్ లా దూసుకెళతాను: చంద్రబాబు


ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో పార్టీ నేత రేవంత్ రెడ్డిని ఇరికించి, తనపై విమర్శలు చేస్తున్న టీఆర్ఎస్, వైసీపీ పార్టీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. అంతేగాక రేవంత్ కేసులో తానే ప్రధాన కుట్రదారు అంటూ తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై తెలంగాణ హోంమంత్రి కేసు పెడతాననడం హాస్యాస్పదమన్నారు. ముందు టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకెళ్లిన కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎవరికీ భయపడేది లేదని... బుల్లెట్ మాదిరి దూసుకెళతానని స్పష్టం చేశారు. 30 ఏళ్ల తన రాజకీయ జీవితంలో నిజాయతీగా బతికానన్నారు. 16 కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి తనను విమర్శిస్తున్నారని జగన్ పై పరోక్షంగా మండిపడ్డారు. పార్టీని ఆదరించిన గోదావరి జిల్లాలకు అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలుగా నెగ్గినవారే కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News