: 'ఆంధ్రాపోరి' టైటిల్ కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా నటించిన చిత్రం 'ఆంధ్రాపోరీ' టైటిల్ వివాదం సమసిపోయింది. ఈ టైటిల్ తమ మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని ఆంధ్రా సెటిలర్స్ పోరం అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, సినిమా టైటిల్ అభ్యంతరకరంగా లేదని అభిప్రాయపడింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది. అంతకుముందు ఈ టైటిల్ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టేదిగా ఉందని పిటిషనర్లు చేసిన వాదనతో న్యాయమూర్తి ఏకీభవించలేదు. దీంతో చిత్రం విడుదలకు అడ్డంకి తొలగినట్లయింది.