: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు... 10 మంది సైనికుల మృతి


మణిపూర్ లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. ఆర్మీ కాన్వాయ్ పై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. భీకర కాల్పులు జరిపారు. సైన్యం అప్రమత్తమయ్యేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 10 మంది సైనికులు మృతిచెందగా, మరో 12 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటన ఈ ఉదయం మణిపూర్ పరిధిలోని చాండేల్ జిల్లాలో జరిగింది. మోతుల్ నుంచి ఇంపాల్ వెళుతున్న 6 డోగ్రా ఆర్మీ కాన్వాయ్ పై దాడి జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలను ప్రారంభించారు. ఇటీవలి కాలంలో మణిపూర్ లో చోటుచేసుకున్న అతిపెద్ద మిలిటెంట్ల దుశ్చర్య ఇదే కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News