: సీమ నుంచి నలుగురు వ్యక్తులు సీఎంలు అయినా అభివృద్ధి మాత్రం శూన్యం: హీరో శివాజీ
రాయలసీమ నుంచి నలుగురు వ్యక్తులు సీఎంలు అయినా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడం సిగ్గుచేటని సినీ నటుడు శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. కడప ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి శివాజీ, హైకోర్టు మాజీ న్యాయమూర్తి లక్ష్మణ్ రెడ్డి హాజరయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు, అధికార, ప్రతిపక్ష నేతలు రాజకీయాలకు అతీతంగా పోరాడాలని కోరారు.